Sunday, October 6, 2024
HomeUncategorizedడ్ర‌గ్స్‌ను నిర్మూల‌న‌కు ప్ర‌భుత్వం కొత్త వ్యూహం

డ్ర‌గ్స్‌ను నిర్మూల‌న‌కు ప్ర‌భుత్వం కొత్త వ్యూహం

Date:

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌లో ప్రహరీ క్ల‌బ్‌ల‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లు ఏర్పాటుచేయనున్నారు.

పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ అధ్యక్షుడిగా హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఉంటాడు. వైస్ ప్రెసిడెంట్‌గా సీనియర్ టీచర్ లేదా ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు. 6 నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాసు లో ఇద్దరు విద్యార్థులు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్.. పేరెంట్స్ నుంచి ఒకరు ప్రహరీ క్లబ్ లో సభ్యులుగా ఉంటారు. పిల్లలు మత్తు పదార్థాలుగా ఉపయోగించే ఔషధ మందులు, పదార్థాలు.. ఇతర రకాల వస్తువులు చేరకుండా నిరోధించడానికి ఈ క్లబ్ లు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే పూర్తి గైడ్ లైన్స్ విడుదల చేయనుంది.