Tuesday, October 1, 2024
HomeUncategorized"డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటికి మన బాధ్యత"

“డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటికి మన బాధ్యత”

Date:

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.. మనుషులను భయపెట్టే విష జ్వరాల వ్యాప్తిలో దాదాపు ఏడాదిలో రెండు లక్షల కేసులు నమోదు అవుతున్న డెంగ్యూ జ్వరం అంటేనే ఒక ప్రత్యేకమైన భయం. దాని గురించి మరి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

డెంగ్యూ జ్వరం, infected female ఏడెస్ (aedes) దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు నిలువ ఉన్న మంచి నీటిలో అభివృద్ధి చెందుతాయి. వర్షం నీటి గుంటలు, కూలర్ లో మిగిలిపోయిన నీరు, పాత టైర్లు, కుండీలు వంటి వాటిలో ఈ దోమలు పెరుగుతాయి. పగటి పూట ఎక్కువ కుడతాయి.

డెంగ్యూ జ్వరం లక్షణాలు, తీవ్రమైన జ్వరం, తల నొప్పి, ముఖ్యంగా తల ముందు భాగంలో, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, వాంతులు, ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. చర్మం అంతా ఎరుపు రంగులో (rash) మారే అవకాశం ఉంది. ఈ జ్వరం రెండు నుండి ఏడు రోజుల వరకు ఉంటుంది. శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోతే, చర్మం పైన ఎర్రగా చుక్కలు (petechiae) ఏర్పడడం, లేదా చిగుర్లు, కడుపు, లేక ఇంకా ఎక్కడి నుండి అయినా రక్తస్రావం అవ్వడం జరగవచ్చు.

అయితే సాధారణంగా లక్షన్నర ఉండవలసిన ప్లేట్లెట్ల సంఖ్య కనీసం యాభై వేలకు తక్కువ అయితే తప్ప కంగారు అవసరం లేదు. అప్పుడు కూడా కేవలం గమనిస్తూ ఉండి, వాటి సంఖ్య పది వేలకు తగ్గితే, లేక ఎక్కడి నుండి అయినా రక్తస్రావం జరిగితే మాత్రమే ప్లెట్లెట్లు ఎక్కించే అవసరం ఉంటుంది. ప్లెట్లెట్ సంఖ్య కన్నా, Hematocrit (PCV /HCt) అనే పరీక్ష ఎక్కువ ముఖ్యం. అది శరీరంలో నీరు తగ్గిపోయి, బీపీ పడి పోయే ప్రాణాపాయ పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. రక్తపరీక్షలో IgM లేక NS 1 అనేవి positive ఉంటూనే dengue ఉన్నట్టు. Ig G పాజిటివ్ ఉంటే కంగారు పడే అవసరం లేదు.

డెంగ్యూ జ్వరం వచ్చిన వారు, లక్షణాలను బట్టి మందులు వాడుతూ, అధికంగా ధ్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. కొందరిలో జ్వరం తగ్గిన తరవాత sudden గా పరిస్థితి విషమంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన ఐదవ రోజు నుండి రెండు మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు కంగారు పడాలి (red flag signs) అంటే, కడుపులో నొప్పి, ఎక్కడి నుండి అయినా రక్తస్రావం, అధికంగా నీరసం, బీపీ తగ్గిపోవడం, అదుపు కాని వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలవాలి.