Sunday, September 22, 2024
HomeUncategorizedడిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధం కాదు

డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధం కాదు

Date:

భారతదేశంలోని రాష్ట్రాలలో ఉపముఖ్యమంత్రులను నియామకంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్‌ చేస్తూ పబ్లిక్‌ పొలిటికల్‌ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం రాజ్యాంగంలోని నిబంధనను ఉల్లంఘించడమేనని, దీని ద్వారా రాష్ట్రాలు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నాయని పిటిషనర్‌ ఆరోపించారు. దీనిపై తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని వెల్లడించింది.

పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వంలోని సీనియర్‌ నాయకులకు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు ఉపముఖ్యమంత్రిని నియమించే పద్ధతిని అవలంబిస్తున్నాయి. అయితే, అది కేవలం ఒక పేరు మాత్రమే. డిప్యూటీ సీఎంగా ఎవరిని అయినా నియమించినా వారు కేబినెట్‌ మంత్రి హోదాలోనే ఉంటారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపముఖ్యమంత్రి మొట్టమొదటి, అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉంటారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదు” అని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించేందుకు, సీనియర్లకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ ఉపముఖ్యమంత్రులు ఉన్న సందర్భాలున్నాయి. అయితే, వారికి కేబినెట్‌ మంత్రి హోదాలోనే వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు.