Sunday, December 22, 2024
HomeUncategorizedటీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతలు

టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతలు

Date:

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని సభ్యులుగా మరో నలుగురిని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

ఈ నియామకాలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెంటనే ఆమోదం తెలపడంతో చైర్మన్‌, సభ్యుల బాధ్యతల స్వీకరణకు లైన్‌ క్లియరైంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం త్వరితగతిన నియమించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షల పదేపదే వాయిదాలతో పాటు, పేపర్‌ లీకేజీల వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.