Saturday, September 28, 2024
HomeUncategorizedజూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

Date:

సాక్షాత్తు పరమశివుడిని దర్శించుకునేందుకు హర..హర మహాదేవ అంటూ భక్తులు చేసే అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూన్ 29 అమర్​నాథ్​ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్ముకశ్మీర్​ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే అమర్​ నాథ్​ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్​ ప్రబుత్వం తాజాగా అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు.

దక్షిణ కశ్మీర్​లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఈ అమర్​నాథ్​ ఆలయం ఉంటుంది. అనంతనాగ్​ జిల్లా పహల్గామ్​, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో అమర్​నాథ్​ యాత్ర కొనసాగుతుంది. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in. వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. అయితే 13 నుంచి 70ఏళ్ల మధ్యలో ఉన్న వారే ఈ యాత్ర చేయాలి. అయితే 6నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లలేరు.

అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాత్ర కు సంభందించిన పలు అంశాలపై చర్చించారు. ఈ ఏడాది దాదాపు 45 రోజుల పాటు మంచులింగ దర్శనానికి అవకాశం ఇవ్వనున్నారు. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్‌ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.

అమర్​నాథ్​ యాత్రికులు పలు సూచనలు

  • అమర్​నాథ్​ యాత్ర సమయంలో ఉష్ణోగ్రతలు 5డిగ్రీల కన్నా తక్కువకు పడిపోవచ్చు. అందువల్ల యాత్రికులు ఉన్నితో తయారు చేసిన దుస్తులను తెచ్చుకోవాలి.
  • గొడుగు, హీటర్​, రెయిన్​కోట్​, వాటర్​ ప్రూఫ్​ షూ తెచ్చుకోవాలి.
  • వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులను వాటర్​ ప్రూఫ్​ బ్యాగుల్లో పెట్టుకోవాలి.
  • ఐడీ కార్డులు, డ్రైవింగ్​ లెసెన్సు, యాత్రకు అనుమతి పత్రాలు కచ్చితంగా ఉండాలి.
  • ఇవి చేయకూడదు..
  • అమర్​నాథ్​ యాత్ర వేళ.. హెచ్చరికలు ఉన్న చోట ఆగకూడదు, వాహనాలు నిలపకూడదు.
  • స్లిప్పరు వేసుకోకూడదు. ట్రెక్కింగ్​ షూలు మాత్రమే ధరించాలి.
  • షార్ట్​ కట్స్​తో కూడిన మార్గాల కోసం ప్రయత్నించకూడదు. అది ప్రమాదకరం. అమర్​నాథ్​ యాత్ర కోసం నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలి.
  • కాలుష్యం, పర్యావరణం దెబ్బతినే విధంగా ఎలాంటి పనులు చేయకూడదు.
  • ప్లాస్టిక్​ను అస్సలు వినియోగించకూడదు. చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడతాయి.