Saturday, September 28, 2024
HomeUncategorizedజూన్‌ వరకు ఎక్కువగా వేడిగాలులు వీచే అవకాశం

జూన్‌ వరకు ఎక్కువగా వేడిగాలులు వీచే అవకాశం

Date:

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సాధారణం కంటే ఎక్కువగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంతజయ్‌ మహాపాత్ర తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మధ్య భారతదేశం, ఉత్తర మైదానాలు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రెండు నుంచి ఎనిమిది రోజులు హీట్‌వేవ్స్‌ కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ప్రభావం ఉంటుందని.. 23 రాష్ట్రాలు వేడిగాలుల కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశాయని ఐఎండీ పేర్కొంది.

మధ్య భారతదేశం, పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కొనసాగే అవకాశం ఉన్నది. పది నుంచి 20 రోజుల పాటు వేడిగాలుల తీవ్రత ఉంటుందని తెలిపారు. పశ్చిమ హిమాలయప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తాయని తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో హీట్ వేవ్ ప్రభావం కనిపిస్తుందని వాతావారణశాఖ తెలిపింది. ఏప్రిల్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది.

మధ్య దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజుల పాటు రెండు నుంచి ఎనిమిది రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వడగాలుల, ఉష్ణోగ్రతల నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులకు ప్రమాదకరమని పేర్కొంది. అలాగే వేడి కారణంగా విద్యుత్‌ గ్రిడ్‌లు, రవాణా వ్యవస్థల మౌలిక సదుపాయాలు ఒత్తిడికి దారి తీసే అవకాశం ఉందని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఐఎండీ కోరింది. వడగాలుల నేపథ్యంలో అడ్వైజరీ జారీ చేయడంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో పలు చర్యలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.