Saturday, October 5, 2024
HomeUncategorizedజాగ్రత్త.. రాష్ట్రంలో డెంగ్యూ పెరుగుతోంది

జాగ్రత్త.. రాష్ట్రంలో డెంగ్యూ పెరుగుతోంది

Date:

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతోన్నాయి. చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో వృద్ధి చెందే ఈ దోమలు ఇంట్లో కూడా పెరుగుతోన్నాయి. వర్షకాలం వర్షపు నీరు నిలిచిపోయి డెంగ్యూ దోమలు పెరుగుతోన్నాయి. ముఖ్యంగా ఇళ్లలో వీటి వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఎండాకాలం కూలర్ వాడిన తర్వాత అందులో వాటర్ తీసివేయాలి. లేకుంటే అందులో దోమలు వృద్ధి చెందుతాయి. అలాగే కొబ్బరి బొండాలను ఇంటి బయట పడేస్తారు. అందులో నీరు చేరి దోమలు తయారవుతాయి.

ఇంటిపై టైర్లు, డబ్బాలు పడేస్తుంటారు. వాటిలో కూడా నీరు చేరి దోమలు వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉండడంతో డెంగ్యూ దోమలు వృద్ధి చెంది డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఆస్పత్రులు డెంగ్యూ కేసులపై రిపోర్ట్ ను ఆలస్యం​ చేస్తుండడం వల్ల కేసుల సంఖ్యపై ఒక్కోసారి గందరగోళం ఏర్పడుతుందని డబ్ల్యూహెచ్​వో విశ్లేషించింది.

డెంగ్యూకు సరైన, కచ్చితమైన ట్రీట్​మెంట్​ అంటూ లేదని డబ్ల్యూహెచ్​వో వివరించింది. ఆదిలోనే గుర్తించడం వల్ల తీవ్రతను తగ్గించేందుకు వీలవుతుందని పేర్కొంది. డెంగ్యూ సోకిన వారికి మొదట తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లల్లో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, గ్రంథుల వాపు, దద్దుర్లు వస్తాయి. సివియర్​ డెంగ్యూ కేసుల్లో తీవ్రమైన కడుపు నొప్పి, అదేపనిగా వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సింటమ్స్ ఉంటాయని డబ్ల్యూహెచ్​వో వివరించింది. అలాగే అలసట, వాంతులు, విరేచనాల్లో రక్తం, బాగా దాహం వేయడం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది.

డెంగ్యూ వచ్చినట్లు త్వరగా తెలుసుకుంటే చికిత్స నయం చేయవచ్చని పేర్కొంది. రాష్ట్రంలోలో డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్​వో తెలిపింది. డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్లు ప్రకటించింది. డెంగ్యూలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నాయని వివరించింది. డీఈఎన్​వీ1, డీఈఎన్​వీ2, డీఈఎన్​వీ3, డీఈఎన్​వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు ప్రకటించింది.