Tuesday, October 8, 2024
HomeUncategorizedజలమయంగా ముంబై మహానగరం

జలమయంగా ముంబై మహానగరం

Date:

ఎడతెరిపి లేని భారీ వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షానికి ముంబై మహానగరం జలమయమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. నగరానికి నీటిని సరఫరా చేసే సరస్సులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ముంబై మహా నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు సరస్సుల్లో రెండు ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. మోదక్-సాగర్ సరస్సు, విహార్ సరస్సు పొంగిపొర్లుతున్నాయని పేర్కొంది. దీంతో సాయన్‌, చెంబూర్‌, అంధేరీ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు శుక్రవారం వరకూ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నాయి