Saturday, October 5, 2024
HomeUncategorizedజలమయంగా దేశ రాజధాని ఢిల్లీ

జలమయంగా దేశ రాజధాని ఢిల్లీ

Date:

దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారు. ఈ వర్షాలతో వారి నివాసాలు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. నీటి ఎద్దడి పరిష్కరించాలంటూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్‌ నేత, ఢిల్లీ జలమంత్రి ఆతిశీ ఇల్లు కూడా వాటిల్లో ఉంది. తన ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ ఎక్స్‌(ట్విటర్) వేదికగా వెల్లడించారు.

ఈ వర్షాలతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌ గోపాల్ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్ ప్రాంతంలోని నివాసం వద్ద నీరు నిలవడంతో సిబ్బంది ఆయన్ను ఎత్తుకొని కారులో కూర్చోపెట్టారు. పార్లమెంట్‌కు వెళ్లేందుకే ఇదంతా అని యాదవ్ వెల్లడించారు. తన ఇల్లంతా నీటితో నిండిపోయిందని, రెండు రోజుల క్రితం చేసిన ఫ్లోరింగ్ అంతా పాడైపోయిందని చెప్పారు. ఫ్లోరింగ్ కోసం వెచ్చించిన సొమ్మంతా వృథా అయిందన్నారు. నీటిని తోడేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితులపై దిల్లీ కౌన్సిలర్, భాజపా నేత రవీందర్ సింగ్ నేగి మాట్లాడుతూ.. ”అన్ని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలానికి ముందు వాటిలో పేరుకుపోయిన చెత్తను తీయకపోవడమే ఈ పరిస్థితికి కారణం” అని ఆరోపించారు.