Wednesday, October 2, 2024
HomeUncategorizedచార్‌ధామ్‌ యాత్రకు లక్షల్లో పెరిగిన భక్తులు

చార్‌ధామ్‌ యాత్రకు లక్షల్లో పెరిగిన భక్తులు

Date:

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో చార్‌ధామ్‌ యాత్ర కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం యాత్రకు వచ్చే వారికి పలు సూచనలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ లేకుండా యాత్రకు వచ్చే వారిని వెనక్కి పంపున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. చార్‌ధామ్‌ యాత్రకు భారీగా ప్రజలు వస్తుండడంతో ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటి వరకు యాత్ర కోసం 31లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది.

ఈ క్రమంలోనే సీఎస్‌ రాధ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటకులైనా వస్తే ఏ రాష్ట్రానికి చెందిన యాత్రికులు రిజిస్ట్రేషన్ లేకుండా వస్తే ఆపేస్తామని ఆయన స్పష్టం చేశారు. చార్‌ధామ్ యాత్రకు రావాలనుకునే వారు రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న తేదీనే రావాలన్నారు. దాంతో యాత్రను సులభతరం చేస్తుందన్నారు. యాత్రికులందరికీ అవగాహన కల్పించాలని కోరారు.


చార్‌ధామ్‌ యాత్రకు ఇప్పటివరకు 31,18,926 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కేదార్‌నాథ్‌లో 10.37లక్షలు, బద్రీనాథ్‌లో 9.55లక్షలు, గంగోత్రికి 5.54 లక్షలు, యమునోత్రికి 4.86లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. హేమకుండ్ సాహిబ్ యాత్రకు ఇప్పటివరకు 84,427 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.