Thursday, October 3, 2024
HomeUncategorizedచంద్రబాబు టీంలో 17 మంది కొత్త వారే

చంద్రబాబు టీంలో 17 మంది కొత్త వారే

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది చేత గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు హాజరయ్యారు.

17 మంది కొత్త వారికి చోటు

మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇందులో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. తెదేపా నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రివర్గంలో చేరారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. భాజపా నుంచి సత్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం దక్కింది.

ప్రమాణ స్వీకారం చేసింది వీరే..

  1. పవన్‌ కల్యాణ్‌ (జనసేన)
  2. నారా లోకేశ్‌ (తెదేపా)
  3. అచ్చెన్నాయుడు (తెదేపా)
  4. కొల్లు రవీంద్ర (తెదేపా)
  5. నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
  6. పి. నారాయణ (తెదేపా)
  7. వంగలపూడి అనిత (తెదేపా)
  8. సత్యకుమార్‌ యాదవ్‌ (భాజపా)
  9. నిమ్మల రామానాయుడు (తెదేపా)
  10. ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌ (తెదేపా)
  11. ఆనం రామనారాయణరెడ్డి (తెదేపా)
  12. పయ్యావుల కేశవ్‌ (తెదేపా)
  13. అనగాని సత్యప్రసాద్‌ (తెదేపా)
  14. కొలుసు పార్థసారథి (తెదేపా)
  15. డోలా బాలవీరాంజనేయస్వామి (తెదేపా)
  16. గొట్టిపాటి రవి (తెదేపా)
  17. కందుల దుర్గేశ్‌ (జనసేన)
  18. గుమ్మిడి సంధ్యారాణి (తెదేపా)
  19. బీసీ జనార్దన్‌రెడ్డి (తెదేపా)
  20. టీజీ భరత్‌ (తెదేపా)
  21. ఎస్‌.సవిత (తెదేపా)
  22. వాసంశెట్టి సుభాష్‌ (తెదేపా)
  23. కొండపల్లి శ్రీనివాస్‌ (తెదేపా)
  24. మందిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి (తెదేపా)