Saturday, September 21, 2024
HomeUncategorizedగ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

Date:

తెలంగాణ గవర్నర్ తమిళసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. కాళోజి కవితతో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారన్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు.

అసెంబ్లీ తొలి రోజు సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరయ్యారు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. అర్హులైన వారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందన్నారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగుల కల్పనపై దృష్టిపెట్టామన్నారు.

ప్రజావాణిలో 1.8కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులరంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామన్నారు. గత సమావేశాల్లో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. దేశ ఏఐ క్యాపిటల్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రానికి కొత్తగా రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ వివరించారు.

ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామని గవర్నర్ చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేసారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం, మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని కూడా అమలులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం లక్ష్యాలను వివరించిన గవర్నర్.. ప్రధానంగా ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఉంటుందని స్పష్టం చేసారు. రేపు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చ జరగనుంది. 10న ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.