పొగాకు వాడకం వల్ల ఎంతోమంది ప్రాణాలు కొల్పొతున్నారు. అందుకు క్రికెట్ స్టేడియంలో పొగాకు ప్రకటనకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ప్రకటనలను ఇకపై క్రికెట్ స్టేడియంలో ప్రదర్శించకూడదని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
పాన్ మసాలా, పొగాకు మిశ్రమం ఉన్న చూయింగ్ గమ్, గుట్కా, పొగ రహిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ను టోర్నీలు జరిగే సమయంలో మైదానంలో ప్రదర్శించవద్దని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఇకనుంచి ప్రజలను ఈ దురలవాటుకు బానిసను చేసేలా ప్రముఖ నటులు, మాజీ క్రికెటర్లు వీటిలో నటించకుండా ఆంక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని సూచించనుంది. ఈ యాడ్స్ ద్వారా పొగాకు ఉత్పత్తులను తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడమే అవుతుందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దేశ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదని తెలుస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.