ఏలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వంగడాలు, సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత వంటి అంశాలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించారు.
చిరుధాన్యాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మోడీ వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రస్తుతం డిమాండ్ పెరిగిందని, ప్రజలు అటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) కొత్త రకాల పంటల గురించి, వాటి ప్రయోజనాల గురించి రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అభినందించారు.