Friday, October 4, 2024
HomeUncategorizedకేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే

కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే

Date:

మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్‌ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్‌ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే, ట్రయల్‌ కోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై హైకోర్టులో సవాల్‌ చేసింది.

ఈడీ తరపు న్యాయవాది ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదించారు. కేజ్రీవాల్‌ బెయిల్‌ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థకు పూర్తి అవకాశం ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ బెయిల్‌ మంజూరు చూయకూడదని తేల్చి చెప్పింది.