Saturday, September 28, 2024
HomeUncategorizedకేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 15న విచారణ

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 15న విచారణ

Date:

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 15న(సోమవారం) విచారించనుంది. సుప్రీంకోర్టు జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు దీనిపై విచారణ జరపనుంది. కాగా తనను ఈడీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించడంపై గతంలో కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీఎం అరెస్టును సమర్థించేందుకు ఈడీ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. అరెస్టు విషయంలో దర్యాప్తు సంస్థను నిందించలేమని పేర్కొంది. ఈ మేరకు కేజ్రీవాల్‌ పిటిషన్‌ను ఏప్రిల్‌ 9న కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మరుసటి రోజే కేజ్రీవాల్‌ సుప్రీంను ఆశ్రయించారు

లిక్కర్‌ స్కాం కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసింది. తర్వాత కొన్ని రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది. అనంతరం కేజ్రీవాల్‌కు ఏప్రిల్‌ 15 వరకు జ్యుడీషియల్‌ రిడ్‌లో విధించడంతో ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు.