Wednesday, September 25, 2024
HomeUncategorizedకేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈడీ స్పందన కోరిన ఢిల్లీ హైకోర్టు

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈడీ స్పందన కోరిన ఢిల్లీ హైకోర్టు

Date:

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు విచారణకు హాజరు కావాలంటూ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరెక్టరేట్‌ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సమన్లు పంపగా.. ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ సమన్లను ఢిల్లీ హైకోర్టులో సీఎం సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈడీ తనకు సమన్లు పంపడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు హైకోర్టు ఈడీ స్పందన కోరింది. కేసు విచారణను ఏప్రిల్‌ 22వ తేదీకి వాయిదా వేసింది.

విచారణ సమయంలో కోర్టు ఈడీ ఎదుట సీఎం ఎందుకు హాజరుకావడం లేదని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని.. అరెస్టు నుంచి భద్రత కల్పిస్తే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈడీ మొదటి సమన్ల సమయంలోనే వ్యక్తులను అరెస్టు చేస్తుందా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌లను ఈడీ ఇదే రీతిలో అరెస్టు చేసిందని తెలిపారు.

ఈడీ, సీబీఐ పదే పదే సమన్లు జారీ చేస్తున్నాయని.. ఇది రాజకీయంగా మాత్రమేనని ఆరోపించారు. ఇటీవల ట్రయల్‌ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈడీ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దివ్య మల్హోత్రా బెయిల్‌ మంజూరు చేశారు. ఈడీ సమన్లు గౌరవించాల్సిన బాధ్యత కేజ్రీవాల్‌కు ఉందని మేజిస్ట్రేట్‌ వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్‌ కేసు సమన్లు సమన్లు జారీ చేసినా హాజరుకాకపోవడంతో కేజ్రీవాల్‌పై ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది.