ఒక వ్యక్తిని పాము కాటేసింది. ఆ వ్యక్తి కాటు వేసిన పామును.. చేతబట్టి ఏకంగా రెండు సార్లు గట్టిగా కొరికాడు. వెంటనే పాము చనిపోయింది. ఆ వ్యక్తి మాత్రం విషం నుంచి కోలుకున్నాడు.
ఝార్ఖండ్‌కు చెందిన 35 ఏళ్ల సంతోష్ లోహర్.. రైల్వే కార్మికుడు. బీహార్ నవాడా జిల్లా రాజౌలీ పరిధిలో ఉన్న ఓ దట్టమైన అటవీ ప్రాంతం వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో తోటి కార్మికులతో కలిసి పనిచేస్తున్నాడు. గత మంగళవారం రాత్రి.. డ్యూటీ ముగించుకుని వచ్చి.. నిద్రపోతుండగా.. ఓ పాము అతడికి కాటేసింది. దీంతో వెంటనే అతడు ఆ పాముని పట్టుకుని తిరిగి రెండుసార్లు గట్టిగా కొరికాడు. విషయం తెలిసిన వెంటనే లోహర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో.. అతను మరనాడు ఉదయానికల్లా కోలుకున్నాడు.