Sunday, September 22, 2024
HomeUncategorizedకవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెయిల్ కోసం అనేకసార్లు ప్రయత్నం చేసిన కవిత చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంది. అయితే నేడు ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసి కవితకు షాక్ ఇచ్చింది.

కవితకు మళ్ళీ నిరాశ

ఇక ఈరోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడి, సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మద్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో మళ్లీ కవితకు నిరాశ ఎదురైంది. ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించగా ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఆగస్టు 20వ తేదీకి వాయిదా

ఈ కేసులో ప్రతి వాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్ ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ కోరుతున్న కవిత పిటిషన్ పై స్పందించాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సిబిఐ, ఈడికి సుప్రీం నోటీసులు పంపించడంతో దీనిపై ఈడి, సిబిఐ అధికారులు తమ స్పందనను తెలియజేయనున్నారు.