Saturday, September 21, 2024
HomeUncategorizedఏపీ నుంచి రావాల్సిన నిధులు ఇప్పించండి

ఏపీ నుంచి రావాల్సిన నిధులు ఇప్పించండి

Date:

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కోన్న మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ‌కు రావాల్సిన నిధులు ఇంకా రాలేద‌ని, వాటిని వెంట‌నే ఇప్పించే విధంగా చూడాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కోరారు. శ‌నివారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగ‌తుల‌ను వివ‌రించి సాయం చేయాల‌ని కోరిన‌ట్లు మీడియా స‌మావేశంలో తెలిపారు.

2014-15లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం నిధులను ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలోనే వేశారు. తెలంగాణ వాటా నిధులు తిరిగి ఇవ్వాలని కోరాం. 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులు రాష్ట్రానికి రాలేదు. ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని అడిగాం. వెంటనే స్పందించి పెండింగ్‌ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం” అని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన 8 అంశాలపై నిర్మలాసీతారామన్‌ సానుకూలంగా స్పందించారని భట్టి చెప్పారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రికి ఈ సందర్భంగా భట్టి ధన్యవాదాలు తెలిపారు.