Wednesday, September 25, 2024
HomeUncategorizedఏఐ నేర్చుకుంటే భారీ జీతం

ఏఐ నేర్చుకుంటే భారీ జీతం

Date:

ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపే చూస్తుంది.. అన్ని ఉత్పాదక రంగాల్లో ఏఐ ప్రాధాన్యత రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అన్ని కంపెనీలు కూడా ప్రస్తుతం (ఏఐ) వైపు మొగ్గుచూపుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో టెకీలు, సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలను కోసం వెతికేవారు తప్పనిసరిగా ఏఐ స్కిల్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే (ఏఐ) స్కిల్స్ ఉన్న వారిని అత్యధికంగా జీతాలు చెల్లించి రిక్రూట్ చేసుకుంటున్నారు టెక్ కంపెనీ యాజమాన్యాలు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇండియాలో అయితే ఏఐ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఏకంగా 54 శాతం కంటే ఎక్కువ జీతాల పెంపును అందించేందుకు సిద్దంగా ఉన్నాయి కంపెనీలు. ఐటీ రంగంలో 65 శాతం, రీసెర్చ్, డెవలప్ మెంట్ రంగంలో 62 శాతం జీతాలు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ నివేదికల ప్రకారం.. ఇండియాలో 97 శాతం మంత్రి టెకీలు తమ (ఏఐ) స్కిల్స్ తోతమ కెరీర్ బాగుంటుందని,దీంతో మంచి జీతాలు, కెరీర్ పురోగతి పెరిగిందని అంటున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్ స్ట్రక్షన్ నుంచి రిటైల్ రంగం వరకు పరిశ్రమలు వేగంగా (ఏఐ) ని ఉపయోగిస్తున్నందున ఆవిష్కరణ, ఉత్పాదకతను పెంచేందుకు (ఏఐ) స్కిల్స్ కలిగిన వర్క్ ఫోర్స్ అవసరం అని కంపెనీలు కోరుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 166 మంది సాఫ్ట్ వేర్లు, 500 మంది యజమానులను సర్వే చేసింది అమెజాన్ వెబ్ సర్వీసెస్. 95 శాతం మంది భారతీయ ఉద్యోగులు తమ కెరీర్ ను మెరుగుపర్చుకునేందుకు (ఏఐ) స్కిల్స్ పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని నివేదికలో పేర్కొంది.