ఏఐను మనుషుల్లా భావించడం ఆపాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐలో మనుషుల తరహా లక్షణాలను తీసుకురావాలనే ఆలోచన సరికాదని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల వెల్లడించారు. అలాగే ఏఐని ఒక సాధనంగా మాత్రమే ట్రీట్ చేయాలని మనుషులకు ఉపయోగించినట్లుగా నామవాచకాలు, సర్వనామాలు వాడడంపై కూడా ఆయన భిన్నంగా స్పందించారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదజాలంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ‘డిఫరెంట్ ఇంటెలిజెన్స్’గా వ్యవహరించి ఉండాల్సిందని సూచించారు.
మనుషులకు మాత్రమే ‘ఇంటెలిజెన్స్’ ఉంటుందని.. ప్రత్యేకంగా దాన్ని ఆర్టిఫిషియల్గా పొందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఏఐతో పూర్తిగా వాణిజ్యపరమైన సంబంధమే ఉండాలని నాదెళ్ల సూచించారు. అవసరమైనప్పుడు సేవలందించే సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. మనుషుల మధ్య బంధాన్ని రీప్లేస్ చేసేలా అది ఉండకూడదన్నారు.