Saturday, September 21, 2024
HomeUncategorizedఎన్ కన్వెన్షన్ లో నాగార్జున స్థలం ఎంత.. కబ్జా ఎంత..

ఎన్ కన్వెన్షన్ లో నాగార్జున స్థలం ఎంత.. కబ్జా ఎంత..

Date:

హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైడ్రా పనితీరు సంచలనంగా మారింది. శనివారం హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్.. హైటెక్ సిటీ జంక్షన్ లో వేల కోట్ల విలువైన 10 ఎకరాల విస్తర్ణంలో ఉంటుంది.. ఇందులో వందలు, వేల కోట్ల డబ్బు ఉన్నవాళ్లు ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి.. భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలను ఇందులో నిర్వహిస్తుంటారు. ఎన్ కన్వెన్షన్.. మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది.. ఇప్పుడు హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. తన విశ్వరూపం చూపించింది. 2015 నుంచి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మడిగుంట చెరువును రక్షించింది. 

*ఎన్ కన్వెన్షన్ పూర్తి వివరాలు..*

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ 10 ఎకరాల్లో తుమ్మటికుంట చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు. ఇందులో ఒక ఎకరా 12 సెంట్లు FTL ( ఫుల్ ట్యాంక్ లెవల్). మరో రెండు ఎకరాలు బఫర్‌ జోన్‌. చెరువు భూమి. తుమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు. ఇందులో హీరో నాగార్జున ఆక్రమించింది 3.5 ఎకరాలు. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలనే హైడ్రా కూలగొట్టింది. 2015లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తుంది. ఎన్ కన్వెన్షన్.. తుమ్మడికుంట చెరువు FTLకు 25 మీటర్లలోనే కట్టారు.. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి.. తుమ్మడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టింది ఎన్ కన్వెన్షన్.. ఇప్పుడు వాటిని పూర్తిగా నేల మట్టం చేశారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలు మాత్రమే..