పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అశ్వరావుపేట నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.