Thursday, January 23, 2025
HomeUncategorizedఉపాధ్యాయులు తేనెతుట్టె లాంటి వాళ్లు..

ఉపాధ్యాయులు తేనెతుట్టె లాంటి వాళ్లు..

Date:

తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా.. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను మీ చేతుల్లో పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి కీలక విషయాలను వెల్లడించారు. ఇటీవల పదొన్నతి 30 వేల మంది టీచర్లతో ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం.. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం.

టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తారీఖునే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం.. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం’ అని అన్నారు. తెలంగాణ బలపడాలంటే అది ఉపాధ్యాయుల వల్లనే సాధ్యం అవుతుందని అన్నారు.