Thursday, October 3, 2024
HomeUncategorizedఉద్యమ పార్టీకి ఒక్క సీటు రాకపోవడమా

ఉద్యమ పార్టీకి ఒక్క సీటు రాకపోవడమా

Date:

లోక్ సభ ఫలితాలు తమని తీవ్ర స్థాయిలో నిరాశపరిచాయని, పార్టీని స్థాపించి 24 ఏళ్ల సుదీర్ఘప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఎన్నికల్లో విజయం కంటే తెలంగాణను సాధించడంమే తమకి పెద్ద గౌరవమని కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. త్వరలోనే పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

“టీఆర్‌ఎస్‌ స్థాపించిన 24 ఏళ్లలో అన్నీ చూశాం. అఖండ విజయాలు, అనేత ఎదురుదెబ్బలు తగిలాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన అతిపెద్ద విజయంగా మిగిలిపోతుంది. ప్రాంతీయ పార్టీ అయినా సరే వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2014 ఎన్నికల్లో 63/119 సీట్లు, 2018 ఎన్నికల్లో 88/119 బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ప్రస్తుతం అసెంబ్లీలో 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. నేటి ఎన్నికల ఎదురుదెబ్బ ఖచ్చితంగా చాలా నిరాశపరిచింది. మరింత కష్టబడి ఉన్నత శిఖరాలను చేరుకుంటాం. ఫీనిక్స్ పక్షి లెక్క కింద నుంచి పైకి వస్తాము” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గత ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లకు పరిమితమవ్వగా.. ఈసారి ఆ సంఖ్యను డబుల్ చేసుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ జరిగింది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది సీట్లు రాగా.. మిగిలిన ఒక్క సీటును ఎంఐఎం దక్కించుకుంది.