Saturday, September 21, 2024
HomeUncategorizedఈ దేశాల్లో విద్యా విధానం చాలా టఫ్

ఈ దేశాల్లో విద్యా విధానం చాలా టఫ్

Date:

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి విద్యా విధానం ఉంటుంది. కొన్ని దేశాల్లో విద్యా విధానం చాలా ఈజీగా ఉంటే, మరి కొన్ని దేశాల్లో చాలా టఫ్‌గా ఉంటుంది. ఉన్నత చదువుల కోసం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లే ముందే అక్కడి విద్యా విధానం గురించి తెలుసుకుంటే మంచిది. ప్రపంచవ్యాప్తంగా టఫెస్ట్ విద్యా విధానం ఉన్నదేశాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

రష్యా

రష్యాలో యూనివర్సిటీ అడ్మిషన్లకు యూనిఫైడ్ స్టేట్ ఎగ్జామ్ తప్పనిసరి. ఇక్కడ 55.4% విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. బిజినెస్‌, ఫైనాన్స్, ఇంజినీరింగ్, ఏరియా స్టడీస్ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు. రష్యా సగటు IQ 96. మాస్కో స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు 12% యాక్సెప్టెన్స్‌ రేషియోని కలిగి ఉన్నాయి.

దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా విద్యా విధానంలో పన్నెండు సంవత్సరాల అధికారిక విద్య తర్వాత NSC పరీక్షలు ఉంటాయి. దేశంలో 58.2% విద్యార్థినులు, 41.8% విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. బిజినెస్‌, ఎకనామిక్స్‌, హెల్త్‌ సంబంధిత కోర్సులు ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. దక్షిణాఫ్రికా సగటు IQ 69. కేప్ టౌన్ విశ్వవిద్యాలయం సుమారు 50% యాక్సెప్టెన్స్‌ రేటును కలిగి ఉంది.

యూఎస్‌

యునైటెడ్ స్టేట్స్ K-12-4 విద్యా విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో 13 సంవత్సరాల అధికారిక విద్య ఉంటుంది. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం GRE నిర్వహిస్తుంది. 67% అమెరికన్ విద్యార్థులు ఒత్తిడిని అనుభవిస్తున్నారు. బిజినెస్‌, హెల్త్, సోషల్‌ సైన్సెస్‌, ప్రముఖ కోర్సులు. యునైటెడ్ స్టేట్స్‌లో సగటు IQ 98. హార్వర్డ్ విశ్వవిద్యాలయం 4% అత్యంత ఎక్కువ ప్రవేశ రేటును కలిగి ఉంది.

సింగపూర్

సింగపూర్‌ విద్యా వ్యవస్థలో ప్రాథమిక, మాధ్యమిక, పోస్ట్ సెకండరీ విద్య వంటి దశలు ఉంటాయి. సింగపూర్-కేంబ్రిడ్జ్ GCE A-స్థాయి పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. సక్సెస్‌ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. 16-24 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల్లో 63% మంది ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, హెల్త్ సైన్సెస్‌ కోర్సులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. సింగపూర్ సగటు IQ స్కోర్ 105.9. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కి సుమారు 16% దరఖాస్తులు అందుతున్నాయి.

దక్షిణ కొరియా

దక్షిణ కొరియా నాలుగు ప్రధాన దశలతో నిర్మాణాత్మక విద్యా వ్యవస్థను అనుసరిస్తుంది. ప్రాథమిక పాఠశాల (6 సంవత్సరాలు), మాధ్యమిక పాఠశాల (3 సంవత్సరాలు), ఉన్నత పాఠశాల (3 సంవత్సరాలు), విశ్వవిద్యాలయం లేదా జూనియర్ కళాశాల (వరుసగా 4 సంవత్సరాలు లేదా 2-3 సంవత్సరాలు.) ఇక్కడి సునెంగ్ అనే కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎనిమిది గంటల నిడివి గల పరీక్ష. ఇది యూనివర్సిటీ ప్రవేశాలు, భవిష్యత్తు కెరీర్ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దేశంలో దాదాపు 35.6% మంది విద్యార్థులు ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థులు రోజుకు సగటున 16 గంటలు చదువుతున్నారు. దేశం సగటు IQ ఏకంగా 106గా ఉంది.

ఫిన్లాండ్

ఫిన్లాండ్‌ 9 సంవత్సరాల పాటు నిర్బంధ విద్యతో 9-3-3 విద్యా వ్యవస్థను అనుసరిస్తుంది. ఉన్నత మాధ్యమిక, ఉన్నత విద్య దశలు ఉంటాయి. ఫిన్నిష్ మెట్రిక్యులేషన్ పరీక్ష ఉన్నత పాఠశాల చివరిలో విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలను పరీక్షిస్తుంది. విశ్వవిద్యాలయ విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలను నివేదిస్తున్నారు. 40% మంది విద్యార్థినులు, 28% విద్యార్థులు ఎడ్యుకేషన్ పరంగా డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఇక్కడి ఐటీ, ఇంటర్నేషనల్ బిజినెస్ లాజిస్టిక్స్ కోర్సులు పాపులర్‌ అయ్యాయి. ఫిన్లాండ్ సగటు 101.2గా ఉంది. హెల్సింకి వర్సిటీ యాక్సెప్టెన్స్‌ రేషియో 17%గా ఉంది.

హాంకాంగ్‌

హాంకాంగ్‌ విద్యా విధానంలో ప్రాథమిక, జూనియర్, సీనియర్ సెకండరీ, తృతీయ విద్యా దశలు ఉంటాయి. HKDSE ఎగ్జామ్‌ చైనీస్, ఇంగ్లీషులో అత్యంత కఠినమైన పరీక్షగా భావిస్తారు. విద్యార్థులు దాదాపు 48.6% ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆర్కిటెక్చర్, కామర్స్, బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ వంటి కోర్సులు పాపులర్‌ అయ్యాయి. హాంకాంగ్‌ సగటు IQ 107. హాంకాంగ్ విశ్వవిద్యాలయం సుమారు 37% యాక్సెప్టెన్స్‌ రేషియోని కలిగి ఉంది.

తైవాన్

తైవాన్‌ నిర్వహించే GSAT ఎగ్జామ్‌, ఉన్నత పాఠశాల విద్యార్థుల కాలేజీ సంసిద్ధతను అంచనా వేస్తుంది. పాఠశాల సంబంధిత సమస్యలు, విద్యా పరీక్షలు 56.7% విద్యార్థులలో ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇంజనీరింగ్, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులు ఎక్కువ మంది చదువుతున్నారు. తైవాన్ సగటు IQ 106.5. తైపీ విశ్వవిద్యాలయం 50% ప్రవేశ రేటును కలిగి ఉంది.

చైనా

చైనా విద్యా వ్యవస్థలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా దశలు ఉన్నాయి. చైనా జాతీయ కళాశాల ప్రవేశ పరీక్ష గావోకావోకి విద్యార్థులను సిద్ధం చేస్తాయి. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గావోకావో ఒక కీలకమైన పరీక్ష. చైనాలో దాదాపు 67.50% మంది కళాశాల విద్యార్థులు మితమైన, అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. క్లినికల్ మెడిసిన్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు పాపులర్‌ అయ్యాయి. చైనా సగటు IQ 104.10. పెకింగ్ విశ్వవిద్యాలయం స్థానికంగా 1% యాక్సెప్టెన్స్‌ రేషియో కలిగి ఉంది. అయితే అంతర్జాతీయ విద్యార్థుల నుంచి 15% దరఖాస్తులు ఈ వర్సిటీకి వస్తున్నాయి.

జపాన్

జపాన్‌లో 9 సంవత్సరాల నిర్బంధ విద్య, తరువాత ఉన్నత మాధ్యమిక పాఠశాల విద్యా విధానాన్ని అనుసరిస్తున్నారు. యూనివర్సిటీ అడ్మిషన్ల కోసం నేషనల్ సెంటర్ టెస్ట్ నిర్వహిస్తుంది. దేశంలో 84.0% మంది విద్యార్థులు, 95.1% విద్యార్థినులు ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఎకనామిక్స్, బిజినెస్, సైన్స్, టెక్నాలజీ కోర్సులు ఎక్కువ మంది చదువుతున్నారు. జపాన్ సగటు IQ 106.5. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్‌కి పోటీ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా 5% నుంచి 30% వరకు ఉంటుంది.