Sunday, December 22, 2024
HomeUncategorizedఇల్లు కొంటే భార్య ఫ్రీ అంటూ ప్రకటన

ఇల్లు కొంటే భార్య ఫ్రీ అంటూ ప్రకటన

Date:

ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇల్లు కొంటే భార్య ఫ్రీ అంటూ ఓ అడ్వర్టైస్‌మెంట్‌ ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డ్రాగన్ దేశంలో ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బాగా పడిపోయింది. గత రెండు సంవత్సరాల నుంచి చైనాలో రియల్ ఎస్టెడ్‌ రంగం పడిపోవడం మొదలైంది. ఇల్లు, భూముల విక్రయాలు జరగక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఎన్నో మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలిపోయాయి. ఇదే సమయంలో పెరుగుతున్న ఖర్చులు, ఆదాయం తగ్గిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో పెళ్లి చేసుకునేందుకు చైనా యువత పెళ్లిళ్లు చేసుకోవడం పట్ల ఆసక్తి చూపట్లేదు. వివాహాలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం కూడా పలు ఆఫర్లు ప్రకటించినా పెద్దగా యువతలో స్పందన లేదు.

దీంతో ఈ రెండు అంశాలనూ ముడి పెడుతూ చైనాలోని టియాంజన్‌ సిటీలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వారి దగ్గర ఉన్న ఇళ్లు అమ్ముడుపోవాలన్న ఉద్దేశ్యంతో “ఇల్లు కొనండి,భార్యను ఉచితంగా పొందండి” అంటూ ఓ ప్రకటన ఇచ్చింది. ఈ ఆఫర్ చూసిన తర్వాత అయినా ఇళ్ల కొనుగోళ్లకు ఊపందుకుంటాయని కంపెనీ భావించింది. అయితే ఈ ప్రకటన చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రజలను ఆకర్షించేందుకు ఈ విధంగా ప్రకటన ఇచ్చినందుకు ఆ కంపెనీపై రూ.3 లక్షల జరిమాన విధించారు. చైనా కంపెనీ ఇచ్చిన ప్రకటనలో పెద్ద మెలిక ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో తెలిపింది. ఇల్లు కొనండి, మీ భార్యకు ఇవ్వండి అనే పదబంధానికి సంబంధించిన తెలివైన మెలికగా దీని గురించి తెలిపింది. ఒకే విధమైన చైనీస్ అక్షరాలను ఉపయోగించి, ఇంటి కొనుగోలుదారులకు కాంప్లిమెంటరీ వస్తువులు అందించాడనికి సంబంధించిన పద్ధతిలో దీనిని ఆ కంపెనీ రూపొందించినట్లు ఆ కథనంలో వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.