Wednesday, October 2, 2024
HomeUncategorizedఇక హైదరాబాద్ తెలంగాణదే

ఇక హైదరాబాద్ తెలంగాణదే

Date:

రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు పని చేసింది. ఆ పదేళ్లు నిన్నటితో ముగిశాయి. ఇక నుంచి తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ మనదే కానుంది. దీంతో ఎలాంటి విభజన సమస్యలు లేని హైదరాబాద్ ​లోని భవనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. పదేళ్లు ఉమ్మడి రాజధాని ప్రకటించినా ఏపీ ప్రభుత్వం మాత్రం 2016-17లోనే అక్కడికి షిఫ్ట్ అయింది. అయినప్పటికీ హైదరాబాద్ జూన్ 1, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది.

హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలన్నీ తెలంగాణకు చెందనున్నాయి. కాగా, హైదరాబాద్​ లోని కొన్ని భవనాలను ఇంకొంతకాలం కంటిన్యూ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్​ లో ఉన్నందున పునర్విజన చట్టాన్ని సవరించి, ఇంకొంత కాలం టైమ్ ఇవ్వాలని ఏపీ కోరినట్లు సమాచారం.

చరిత్ర చూసుకున్నట్లైతే ఒక్కప్పుడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17 భారత్ లో విలీనం అయింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. 1956లో మద్రాస్ నుంచి విడిపోయిన ఏపీని తెలంగాణకు కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఈ కలయికను అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చివరకు తిరిగి స్వరాష్ట్రం సాధించుకున్నారు.