Sunday, September 22, 2024
HomeUncategorizedఇండియా కూటమి కథ ముగిసింది

ఇండియా కూటమి కథ ముగిసింది

Date:

ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైంది. అసలు ఆ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడం నాకు ముందునుంచే ఇష్టం లేదు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాను. బిహార్‌ ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నా. దీనిని కొనసాగిస్తూనే ఉంటా” అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించగా.. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఆప్ ఒక్క సీటు మాత్రమే ఆఫర్‌ చేసింది. మరోవైపు ఫరూక్‌ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కాషాయ పార్టీతో జట్టు కట్టే అవకాశాలున్నట్లు ఆర్‌ఎల్‌డీ హింట్‌ ఇచ్చింది. నీతీశ్‌ కోసం ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. ‘ఎవరు ఏం మాట్లాడుతున్నా.. దాని గురించి ఆలోచించవద్దు. పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లే వారి (ఆర్‌జేడీని ఉద్దేశిస్తూ) నుంచి విడిపోయా” అని నీతీశ్‌ పేర్కొన్నారు.