Tuesday, October 8, 2024
HomeUncategorizedఇండియాలో పెరిగిన అటవీ విస్తీర్ణం

ఇండియాలో పెరిగిన అటవీ విస్తీర్ణం

Date:

భారతదేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది. అటవీ శాతం పెరిగిన టాప్ 10 దేశాల్లో ఇండియా మూడవ స్థానంలో ఉన్నది. సోమవారం రిలీజైన రిపోర్టులో చైనా మొదటి స్థానంలో ఉన్నది. చైనాలో 1,937,000 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగినట్లు రిపోర్టులో తెలిపారు. ఆ తర్వాత రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నది. ఆస్ట్రేలియాలో 4,46,000 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం పెరిగింది. టాప్ టెన్ దేశాల్లో చిలీ, వియత్నాం, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, రొమేనియా ఉన్నాయి.

ఇండియాలో అటవీ విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రశంసలు కురిపించింది. నిర్వీర్యం అవుతున్న నేలల్లో ఇన్నోవేటివ్ పద్ధతుల ద్వారా భారత్ తన అటవీ విస్తీర్ణాన్ని పెంచుతున్నట్లు యూఎన్ తెలిపింది. చాలా వరకు దేశాల్లో అటవీ నిర్మూలన తగ్గినట్లు ఆ రిపోర్టులో తెలిపారు. ఇండోనేషియాలో 2021 నుంచి 2022 వరకు డిఫారెస్టేషన్ 8.4 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లోనూ 2023లో అటవీ నిర్మూలన 50 శాతం తగ్గినట్లు రిపోర్టులో తెలిపారు.