Sunday, September 29, 2024
HomeUncategorizedఇంట్లో తెలియకుండా చదివి ఐఏఎస్ సాధించాడు

ఇంట్లో తెలియకుండా చదివి ఐఏఎస్ సాధించాడు

Date:

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. సివిల్స్‌ – 2023 తుది ఫలితాల్లో కేరళకు చెందిన పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్ నాలుగో ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు. సిద్ధార్థ్‌ పేరు మీడియాలో వచ్చేవరకు ఆయన పరీక్ష రాసిన విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం. జాతీయ మీడియా కథనాల ప్రకారం ”మా అబ్బాయి ఈసారి సివిల్స్‌ పరీక్ష రాసిన విషయం మాకు తెలియదు. అందులో ఉత్తీర్ణుడై ఇంటర్వ్యూకు వెళ్లిన సంగతి మాకు చెప్పలేదు. టీవీలో పేరు కనిపించినప్పుడే ఇదంతా మాకు తెలిసింది. ఇంటికి వచ్చి పరీక్షలు రాసినా.. మాకు ఆ విషయం తెలియనివ్వలేదు. తన ర్యాంకు గురించి చెప్పడానికి ఫోన్‌ చేసి కొద్దిసేపే మాట్లాడాడు” అని సిద్ధార్థ్‌ తల్లి వెల్లడించారు. ప్రస్తుతం తన కుమారుడు ఐపీఎస్‌ను వీడి ఐఏఎస్‌లో చేరతారని ఆమె తెలిపారు. ర్యాంకర్ తండ్రి మాట్లాడుతూ..”ఇది మేం అసలు ఊహించలేదు. ఇలాంటి అనూహ్య సంఘటనలు జరిగితే ఆనందం రెట్టింపు అవుతుంది” అని సంతోషం వ్యక్తంచేశారు.

సిద్ధార్థ్‌ ఈ పరీక్ష రాయడం ఇదే తొలిసారి కాదు. మొదట ఇండియన్ టెలీకమ్యూనికేషన్ సర్వీస్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐపీఎస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.