Wednesday, September 25, 2024
HomeUncategorizedఆ ఇద్దరు అన్నదమ్ములు ఐపిఎస్ ఆఫీసర్లు

ఆ ఇద్దరు అన్నదమ్ములు ఐపిఎస్ ఆఫీసర్లు

Date:

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులయ్యారు. దీంతో పోలీస్ చరిత్రలోనే అన్నదమ్ములిద్దరూ డీజీపీగా ఉండటం ఇదే ప్రథమం. బిహార్ కు చెందిన వివేక్ సహాయ్, వికాస్ సహాయ్ లు అన్నదమ్ములు. వీరిద్దరు ఐపీఎస్ లుగా ఉద్యోగాలు పొందారు. మొత్తంగా ఈ సహాయ్ కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. వివేక్ సహాయ్ 1988 బ్యాచ్, వికాస్ సహాయ్ 1989 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారులుగా మారారు. వీరి సోదరుడు విక్రమ్ సహాయ్ 1992 బ్యాచ్ కి చెందిన ఐఆర్ఎస్ అధికారి. గతేడాది కాలంగా గుజరాత్ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా వికాస్ సహాయ్ ఉన్నారు. అయితే సోమవారం వివేక్​ పశ్చిమ బెంగాల్​ డీజీపీ నియయమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వూలు జారీ చేసింది. దీంతో అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా అయ్యారు.

వివేక్ సహాయ్ విషయానికి వస్తే.. ఈయన పశ్చిమ బెంగాల్ కేడర్ కి చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఈ రాష్ట్రంలోనే డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ గార్డ్ గా పని చేశారు. 2021లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ భద్రత అధికారిగా ఉన్నారు. వివేక్ తన విధుల్లో విఫలమయ్యాడని ఆ ఏడాది ఆయనను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తిరిగి 2023లో డీజీగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఇటీవలే బెంగాల్ డీజీపీ ఐపీఎస్ ను తొలంగించిన కేంద్ర ఎన్నికల సంఘం వివేక్ సహాయ్ కి ఆ బాధ్యతలను అప్పగించింది.

వికాస్ సహాయ్ విషయానికొస్తే గుజరాత్ కేడర్ కి చెందిన 1989 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారి. 1989 ఐపీఎస్ గా ఎంపికైన తరువాత గుజరాత్ లోని పలు జిల్లాలకు డీఎస్పీగా పని చేశారు. అనంతరం 1999లో ఆనంద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2001లో అహ్మదాబాద్​ గ్రామీణ ఎస్పీగా పనిచేశారు. 2002లో జరిగిన గోద్రా ఘటనలో వికాస్ కూడా గాయపడ్డాడు. అలా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టుల్లో బాధ్యతలను నిర్వర్తించారు. 2007లో సూరత్‌లో అదనపు సీపీగా నియమితులయ్యారు. 2009లో ఐజీ (సెక్యూరిటీ), 2010లో సీఐడీ విభాగంలో ఐజీగా పనిచేశారు. 2023లో గుజరాత్​కు డీజీపీగా నియమితులయ్యారు.