Friday, September 20, 2024
HomeUncategorizedఆహారంలో చక్కెర తగ్గిస్తే ఎన్నో లాభాలు

ఆహారంలో చక్కెర తగ్గిస్తే ఎన్నో లాభాలు

Date:

మనిషి తినే ఆహారంలో చక్కెర పదార్థం ప్రధాన భాగమైపోయింది. ఉదయం లేవగానే తాగే టీ, కాఫీ నుంచి రాత్రి భోజనం తర్వాత తాగే పాల వరకు అన్నింటిలో చక్కెర తప్పకుండా ఉండాల్సిందే. చక్కెర కాస్త తక్కువ అయితే ఏదో తెలియని లోటుగా భావిస్తుంటాం. కానీ చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. చక్కెర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే చక్కెరను తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా చక్కెరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో చక్కెర కెంటెంట్‌ ఎక్కువగా ఉంటే జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. దీంతో సహజంగానే బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా చక్కెరను తగ్గించాలని సూచిస్తున్నారు.
  • షుగర్‌ను తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది. అలాగే కణజాలం, కీళ్లలో నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా క్రీడా, రంగాల్లో ఉండే వారు చక్కెర కంటెంట్‌ను తక్కువ తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం.
  • ఇక చక్కెరను అదుపులో ఉంచుకోవడం వల్ల మొటిమలు వంటి వాటికి చెక్‌ పెట్టొచ్చు. షుగర్ వల్ల ఏర్పడే వాపు కొల్లాజెన్ కోల్పోవడానికి కారణమవుతుంది అలాగే చర్మంపై మొటిమలు వస్తాయి. మీరు కూడా మొటిమల సమస్యతో బాధపడుతుంటే చక్కెర తీసుకోవడాన్ని తగ్గించుకోండి. తేడా మీకే తెలుస్తుంది.

చక్కెరను ఇలా తగ్గించుకోండి..

చక్కెరను ఎక్కువగా తీసుకునే వారు దానికి బదులుగా.. నేచురల్‌ స్వీట్స్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం యాపిల్స్, బెర్రీలు లేదా నారింజ వంటి తాజా పండ్లను తీసుకోవాలి. మీ శరీరానికి నేచురల్‌ షుగర్‌ను అందిస్తాయి. ఇక ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కి వెనకాల ఉండే లేబుల్స్‌ను ఒకసారి చెక్‌ చేయడం దానిపై సిరపల్‌ లేదా సుక్రోజ్‌ అనే రాసి ఉంటే వాటికి దూరంగా ఉండండి. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో ఉప్పుతో పాటు చక్కెర కంటెంట్‌ కూడా ఎక్కువగా ఉంటుంది.