Saturday, September 21, 2024
HomeUncategorizedఆన్ లైన్ లో మేడారం మొక్కులు చెల్లింపు..

ఆన్ లైన్ లో మేడారం మొక్కులు చెల్లింపు..

Date:

గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారక్క జాతరకు మేడారం సిద్ధమైంది. ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ జాతరకు వెళ్లే వారు దాదాపు అందరు నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పిస్తారు. అయితే కొంత మంది జాతరకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటారు. వారి కోసం దేవాదాయ శాఖ ఆన్ లైన్ సేవలు ప్రవేశపెట్టారు.

అక్కడికి వెళ్లలేని భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించవచ్చు. టీ యాప్ ఫోలియో, మీ సేవ, పోస్టాఫీస్ ద్వారా మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నిలువెత్తు బంగారం సమర్పించుకునే వారు ఎంత బరువు ఉన్నారో లెక్కించుకోవాలి. ఆ బరువుకు కిలో రూ.60 చొప్పున చెల్లించాలి. ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉంటే.. కిలోకు రూ.60 చొప్పున రూ.360 చెల్లించాలి. ఈ సర్వీస్ ను మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు. అంతే కాదు పోస్టాఫీస్ ద్వారా మేడారం ప్రసాదం పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. మేడారం వెళ్లి నిలువెత్తు బంగారం సమర్పించే వారు తప్పకుండా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్లాలి. మీరు అక్కడ బెల్లం కొనుగోలు చేయాలంటే ఆధార్ జిరాక్స్ సమర్పించాలి. మేడారంలో బెల్లం కొనుగోలు చేసిన భక్తుల వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖా వ్యాపారులను ఆదేశించింది. దీంతో వ్యాపారులు బెల్లం కొనే వారి వద్ద ఆధార్ జిరాక్స్ తీసుకోనుంది.