Saturday, September 21, 2024
HomeUncategorizedఅసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌

Date:

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ రూపకల్పన చేసారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వెల్లడించారు.

వివిధ శాఖలకు కేటాయింపులు..

ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు

ఆర్థిక మంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు

త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తాం.
త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం.
టీఎస్‌పీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి రూ.40 కోట్లు
గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్‌ కింద రూ.5 లక్షల ప్రమాద బీమా.
‘ప్రజావాణి’లో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054. ఇళ్ల కోసం వచ్చినవి 14,951
దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత
ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం
ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తాం
గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
త్వరలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం
దావోస్‌ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి
పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు మరింత అభివృద్ధి
ప్రభుత్వం నుంచి 2 లెదర్‌ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం
డ్రై పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్‌ ప్రణాళిక
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తాం
ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ.. రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు
ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్‌ సంస్థతో సంప్రదింపులు
దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం