Sunday, September 22, 2024
HomeUncategorizedఅయోధ్య ప్రారంభోత్సవంలో దళితులేరి…!

అయోధ్య ప్రారంభోత్సవంలో దళితులేరి…!

Date:

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో ఒక్క దళితుడైనా కనిపించారా?.. దళితులే కాదు.. ఆదివాసి అయినా రాష్ట్రపతి ముర్మును కూడా కేంద్రం ఆహ్వానించలేదని ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అంబానీ, అదానీ, అమితాబ్ బచ్చన్ కుటుంబం మాత్రం కనిపించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీని బట్టి రామమందిరంలో దళితులకు, ఆదివాసీలకు చోటు లేదని అర్థమవుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు.

గత నెల 22న అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులను కేంద్రం ఆహ్వానించింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి రాహుల్.. తన ప్రసంగంలో బచ్చన్ పేర్లను లేవనెత్తారు. రామమందిర ప్రారంభోత్సవంలో ఓబీసీలకు చోటు లేదా? అంటూ మోడీని రాహుల్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఈ ప్రోగ్రామ్‌కి ఐశ్వర్యరాయ్ హాజరుకాలేదు.. కానీ వారి పేర్లను రాహుల్ ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకముందు రాహుల్‌కు ఘనస్వాగతం లభించింది. ఈనెల 16న వారణాసిలో రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఈనెల 21 వరకు యూపీలో యాత్ర కొనసాగుతోంది. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమిని ఎదుర్కొన్నారు. తాజాగా అదే నియోజకవర్గంలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మృతి ఇరానీ కూడా అమేథీలోనే పర్యటిస్తు్న్నారు. అలాగే ప్రధాని మోడీ కూడా లక్నోలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇంకోవైపు ఇండియా కూటమి మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ మాత్రం రాహుల్ యాత్రలో పాల్గొన లేదు. సీట్లు పంపకాలపై క్లారిటీ వచ్చాకే రాహుల్ యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ తేల్చి చెప్పారు.