Friday, October 4, 2024
HomeUncategorizedఅమెజాన్‌ ఆర్డర్‌లో విషపూరిత పాము ప్రత్యక్ష్యం

అమెజాన్‌ ఆర్డర్‌లో విషపూరిత పాము ప్రత్యక్ష్యం

Date:

ప్రస్తుత సమాజంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక్కోసారి ఒకటి ఆర్డర్‌ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఫోన్లు ఆర్డర్‌ చేస్తే బిస్కెట్లు, స్టోన్స్‌ వంటివి పార్శిల్స్‌లో వచ్చిన ఘటనలను ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఓ జంట ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ కోసం ఆర్డర్ పెడితే ప్రమాదకరమైన పామును అమెజాన్‌ ఆర్డర్ చేసింది. దీంతో అమెజాన్‌ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కస్టమర్‌ చేసిన ఆర్డర్‌కు బదులు పామును పంపారు.

బెంగళూరులోని ఒక మహిళ ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఆర్డర్‌ పెట్టారు. అయితే అమెజాన్ ఆర్డర్‌లో జీవించిన ఉన్న కోబ్రాను అమెజాన్ యాజమాన్యం అందించారు. అయితే విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకోవడంతో ఆమె కుటుంబానికి ఎలాంటి హాని జరగలేదు. ఆర్డర్ ఓపెన్ చేసే ప్రక్రియను వారు వీడియో తీయడంతో దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా అవుతున్నాయి.

ఈ ఘటనపై అమెజాన్ ప్రతినిధి స్పందించారు. దీనిపై అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ..మా కస్టమర్‌లు, ఉద్యోగులు మరియు సహచరుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యతని, కస్టమర్‌లకు విశ్వసనీయమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి మేము కష్టపడి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కస్టమర్‌లకు ఇలాంటి ఘటనలు జరగ్గకుండా జాగ్రత్త వహిస్తామని..వారికి పూర్తి భరోసా కల్పిస్తామని అమెజాన్ ప్రతినిధి హామీ ఇచ్చారు.