Wednesday, October 9, 2024
HomeUncategorizedఅప్పుడ‌ప్పుడు పీత‌ల‌ను ఆర‌గించండి..

అప్పుడ‌ప్పుడు పీత‌ల‌ను ఆర‌గించండి..

Date:

నాన్‌వెజ్ ప్రియులు చాలా మంది చికెన్ లేదా మ‌ట‌న్ అంటే బాగా ఆస‌క్తి చూపుతారు. కాని మాంసాహారంలో చేప‌లు, రొయ్య‌లు, పీత‌లు సీఫుడ్స్ చాలా ప్ర‌ధాన‌మైన‌వి. వీటిలో పీతలు చాలా స్పెషల్. ఎప్పుడూ చికెన్, మటన్ తినేవారు అప్పుడప్పుడూ కొత్త రుచి, ఆరోగ్యం కోసం పీత‌లు తినడం మంచిది. వీటిలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. పీతల్లో ఉండే న్యూట్రియెంట్స్, వాటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం.

*పోషకాలు*

పీతల నుంచి సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ లభిస్తాయి. వీటిలో కండరాల బలోపేతానికి అవసరమైన ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, సెలీనియం వంటి న్యూట్రియెంట్స్ సైతం ఉంటాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, వివిధ రకాల వ్యాధుల రిస్క్‌ తగ్గిస్తాయి. వీటిని డైట్‌లో యాడ్ చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

*మెదడు పనితీరు*

కనీసం వారానికి ఒకసారైనా పీతలు వంటి సీఫుడ్ తినే వ్యక్తుల్లో మానసిక సమస్యలు, అల్జీమర్స్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఇప్పటికే అనేక పరిశోధనలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఎందుకంటే సీఫుడ్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మానసిక సమస్యలకు చెక్ పెడతాయి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే మెదడు పనితీరును పెంచుతాయి.

*ఎముకల బలోపేతం*

ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం, ఫాస్ఫరస్ అవసరం. పీత మాంసంలో ఈ మూలకం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా, బలంగా మారుస్తుంది.

*సెలీనియం*

ఇతర మాంసాలతో పోలిస్తే పీతల్లో సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండే ఈ ఖనిజం, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్ డ్యామేజ్‌ ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సెలీనియం థైరాయిడ్ పనితీరును మెరుగుపర్చడంతో పాటు మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.

*కంటి ఆరోగ్యం*

పీతల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా కాపాడుతుంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఐరన్ మెదడు పనితీరు, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

*గుండె ఆరోగ్యం*

పీతల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మంచివి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రిస్తాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టే రిస్క్‌ తగ్గుతుంది, రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ తగ్గుతాయి. ఫలితంగా భవిష్యత్‌లో గుండెపోటు, స్ట్రోక్స్ రిస్క్ తగ్గుతుంది. మొత్తంగా హృదయ స్పందన రేటు మెరుగుపడి గుండె ఆరోగ్యం బాగుపడుతుంది.

*రక్తహీనత నివారణ*

విటమిన్ B12, ఫోలేట్‌ వంటి అనేక పోషకాలు ఉండే పీతలను ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ లోపం కారణంగా ఏర్పడే అనీమియా ముప్పును తగ్గించుకోవచ్చు. అనీమియా బాధితుల్లో తగినంత స్థాయిలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కావు. దీంతో వారు తరచుగా అలసట, బలహీనతకు గురవుతుంటారు. ఈ సమస్యలను నివారించాలంటే డైట్‌లో పీతలను చేర్చుకోవాలి.