Monday, September 23, 2024
HomeUncategorizedఅన్ని గొప్పలే, మరీ భక్తుల తిప్పలకు బాధ్యులెవరు..

అన్ని గొప్పలే, మరీ భక్తుల తిప్పలకు బాధ్యులెవరు..

Date:

ఒకప్పుడు సింగిల్ రోడ్డు ఉన్న కారణంగా మేడారం జాతరలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యేది. గత కొన్ని ఏళ్లుగా మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరలకు వచ్చే భక్తులు ఎప్పుడు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయిన  ధాఖలాలు లేవు. కానీ ఈ సారి మేడారం జాతరకు వచ్చే భక్తులు ఘోరమైన ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తాడ్వాయి నుండి మేడారం వరకు గల కీకారణ్యంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన భక్తులు నీళ్లు-నిప్పులు దొరకక పిల్లలు, పెద్దలు అల్లాడుతున్నారు. మరో కుంభమేళాపై జరిగే మేడారం గిరిజన జాతర గత జాతరలతో పోల్చుకుంటే ఈ సారి గొప్పలకుపోయి ఆరువేల బస్సులను కేటాయించడం, మహిళలకు ప్రీ బస్సు సౌకర్యం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అలాగే అనుభవం లేని ఐఏఎస్ అధికారుల మానిటరింగ్, భక్తులను రద్దీని బట్టి క్లియర్ చేయడంలో విఫలం చెందారని తెలుస్తున్నది. పైగా మూడవరోజు శుక్రవారం కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెఢ్డి, చవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా పర్యటించడంతో భక్తులు పొద్దుపోయిన తర్వాత మేడారం బయలు దేరారు.

భక్తులు తిరుగు ప్రయాణంలో ఉండాల్సిన భక్తులు, దర్శనానికి పోటెత్తడంతో ట్రాఫిక్ జాం అయిందని తెలుస్తున్నది. ఇది ఇలా ఉండగా అవుట్  గోయింగ్ వాహనాలను పంపించడంలో అధికారులు ప్రీయార్టి ఇవ్వడంలో విఫలం చెందారని తెలుస్తున్నది. మేడారం జాతరను పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ, రూరల్ డెవలఫ్ మెంట్ శాఖ, మంత్రి ధనసరి అనుసూయకు ట్రాఫిక్ జాం పెద్ద రిమార్క్ గా తయారైంది. గతంలో 2012 సంవత్సరంలో 18 గంటలు ట్రాఫిక్ జాం అయి భక్తులు అరిగోస పడ్డారు. గతంలో సింగిల్ రోడ్డు,న్యారో కాల్వర్టులు ఉన్న కారణంగా ట్రాఫిక్ జాం అయింది.కానీ ఇప్పుడు డబుల్ రోడ్డులో నిర్మించినా గంటల తరబడి ట్రాఫిక్ జాం కావడం అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.