దేశం పరిస్థితి పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా లోక్ సభలో అధికార బీజేపీ ప్రభుత్వంపై ఈ విధంగా స్పందించారు. అగ్నివీర్‌లను కూడా కేంద్రం మోసం చేస్తుందని అన్నారు. వారి పెన్షన్ కోసం బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు.
బీజేపీని చూసి దేశంలోని అన్ని వర్గాలు భయపడుతున్నాయి. దేశంలో యువత, రైతులు, కార్మికులు అందరూ భయపడుతున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆందోళనకు కూడా దిగుతున్నారు. రైతులకు ఎంఎస్‌పీ ఇస్తామని చట్టం చేయాలి. రైతులకు ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లభించలేదు. కేంద్రం విధానాలు చూసి రైతులు భయపడుతున్నారు. రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. కరోనా సమయంలో మధ్య తరగతి ప్రజలు అంతా ప్రధాని మోదీ చెప్పినట్లు చేశారు. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి వారిపై అదనపు భారం వేసారు. ఎలాంటి లబ్ధి ప్రజలు కలిగేలా కనిపించడం లేదు. మా హయాంలో నిబంధనలు సడలించి రైతు రుణమాఫీ చేశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.