Sunday, September 22, 2024
HomeUncategorizedఅక్కలను అడ్డుపెట్టుకొని రాజకీయం

అక్కలను అడ్డుపెట్టుకొని రాజకీయం

Date:

తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అక్కలను అడ్డంపెట్టుకుని ఆ పార్టీ రాజకీయం చేస్తోందన్నారు.

”సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసినా ఏం అనలేదు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. నా ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా?నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తిహాడ్‌ జైలులో ఉన్నారు” అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.