Sunday, December 22, 2024
HomeUncategorizedవిప్ల‌వాత్మ‌క మార్పుల‌కు రాజీవ్‌గాంధీ శ్రీకారం

విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు రాజీవ్‌గాంధీ శ్రీకారం

Date:

దేశంలోని ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు, విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థలు ఆయన హయాంలోనే బలోపేతం అయ్యాయని తెలిపారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. పంజాగుట్టలోని రాజీవ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా భారాస నేతలపై సీఎం మండిపడ్డారు. అధికారం పోయినా.. వారికి అహంకారం తగ్గలేదని విమర్శించారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని అంటున్నారని.. అనవసర ఆరోపణలు చేస్తే భారాస నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. డిసెంబర్‌ 9లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ అకాడమీలుగా మారుస్తామని ప్రకటించారు.