Saturday, December 21, 2024
HomeUncategorizedవయనాడ్‌లో 130మంది ఆచూకీ దొరకలే

వయనాడ్‌లో 130మంది ఆచూకీ దొరకలే

Date:

కేరళ వయనాడ్‌లో జులై 30న కొండచరియలు విరిగిపడిన ఘటనలో 229 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 51 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. వీరికి సంబంధించిన డీఎన్ఏ నివేదిక ఆగస్టు 13లోగా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాదాపు 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని ప్రభుత్వం వెల్లడించింది. వీరికోసం గడిచిన రెండు వారాలుగా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్‌, పోలీస్‌, అగ్నిమాపక, అటవీశాఖలకు చెందిన 190 మంది సభ్యుల బృందం.. వరదలు చోటుచేసుకున్న ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి.

ఇందులో భాగంగా చలియార్‌ నది, దాని పరివాహక ప్రాంతాలు, సమీప అడవులపై దృష్టిసారించినట్లు ఏడీజీపీ ఎం ఆర్‌ అజిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను ఇప్పటికే ఒకసారి గాలించామని, తాజాగా నది, దాని తీర ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతం మొత్తం పూర్తికాగా, ప్రస్తుతం దిగువన తమ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. అయితే, నీటి స్థాయిలు తగ్గడంతో మృతదేహాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. భారీ వర్షం కారణంగా సెర్చ్‌ ఆపరేషన్‌కు అంతరాయం కలుగుతోందన్నాయి. అయితే, సోమవారం చేపట్టిన గాలింపులో పలు శరీర భాగాలు లభ్యమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.