Saturday, December 21, 2024
HomeUncategorizedయూపీలో 513 మ‌ద‌ర్సాల గుర్తింపు ర‌ద్దు

యూపీలో 513 మ‌ద‌ర్సాల గుర్తింపు ర‌ద్దు

Date:

ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపును ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత, ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ మంగళవారం జరిగిన సమావేశంలో 513 మదర్సాల అనుబంధాన్ని తొలగించాలని సిఫారసు చేసింది. వీటిలో చాలా మదర్సాలు బోర్డుకు సంబంధించిన పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడంతో విఫలమయ్యాయి. మిగతావి వివిధ కారణాల వల్ల డిస్‌-అఫిలియేషన్‌ని కోరుకుంటున్నాయి.

యూపీ వ్యాప్తంగా దాదాపుగా 25,000 మదర్సాలు ఉన్నాయి. వీటిలో 16500 మదర్సాలు ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉన్నాయి. మదర్సా బోర్డు ఛైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ ఈ అంశంపై మాట్లాడారు. ” మంగళవారం జరిగిన సమావేశంలో మొదటి ప్రతిపాదన 2018 నుంచి 2024 వరకు మార్క్‌షీట్‌లను అప్‌లోడ్ చేయడం. పాత మార్క్ షీట్లను కూడా పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త మదర్సాల అఫిలియేషన్ ఇవ్వడంపై చర్చ జరిగింది. అఫిలియేషన్ కోసం కొత్తగా దరఖాస్తులు పోర్టల్ ద్వారా ఆమోదించబడుతాయి” అని అన్నారు.