బంగ్లాదేశ్‌లో హిందువులను టార్గెట్ చేస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆరోపించారు. సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన బుధవారం అన్నారు. అయోధ్య పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్య నిర్మాణం పెద్ద ప్రయాణంలో ప్రధాన మైలురాయి అని అన్నారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సనాతన ధర్మ పరిరక్షణకు ఉమ్మడిగా కృషి చేయాలని ఆయన కోరారు. 500 ఏళ్ల పోరాటం తర్వాత రామ మందిర నిర్మాణం పూర్తైందని, ఇది ఒక పెద్ద సామాజిక లక్ష్యం దిశగా ఒక మైలురాయి అని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మొదటి అధ్యక్షుడు, స్వర్గీయ బ్రహ్మలిన్ పరమహంస రాంచరణ్ దాస్ 21వ వర్ధంతి సందర్భంగా యోగి ఆదిత్యనాత్ నివాళులు అర్పించారు. ఆయన గౌరవార్థం అయోధ్యంలో విగ్రహాన్ని ఆశిష్కరించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధినేత నృత్య గోపాల్ దాస్ మహరాజ్‌ని సీఎం యోగి కలిశారు. ఈ కార్యక్రమంలో యూపీ మంత్రి మహంత్ సురేష్ దాస్, సూర్యప్రతాప్ షాహీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.