Friday, December 27, 2024
HomeUncategorizedత్వ‌ర‌లో భార‌త ప‌ర్య‌ట‌న‌కు జెలెన్‌స్కీ..

త్వ‌ర‌లో భార‌త ప‌ర్య‌ట‌న‌కు జెలెన్‌స్కీ..

Date:

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలోనే భారతదేశ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇంకా పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్‌ రాయబారి తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. భారత్‌కు రావాలని జెలెన్‌స్కీని ఆహ్వానించారు. నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఏడాది చివర్లో ఇక్కడ పర్యటించే చాన్స్ కనిపిస్తుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో ముందడుగు కానుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఈ ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌ చుక్ వెల్లడించారు.

మరోవైపు, రెండున్నరేళ్లుగా యుద్ధంతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23వ తేదీన పర్యటించారు. 1991లో సోవియట్‌ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడిన తర్వాత ఓ భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో చర్చలు, దౌత్యమార్గాల్లో ఉక్రెయిన్‌- రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు.. ఇందుకు అన్నివిధాలా కృషి చేస్తామని భారత్‌ భరోసా కల్పిస్తోంది.