Sunday, December 22, 2024
HomeUncategorizedతెలంగాణ‌లో ప్ర‌యివేట్ ఆసుప‌త్రులే ఎక్కువ‌

తెలంగాణ‌లో ప్ర‌యివేట్ ఆసుప‌త్రులే ఎక్కువ‌

Date:

ఆనందంగా బ‌తుకుతున్న ప్ర‌తి మ‌నిషి జీవితాన్ని ఒకేసారి త‌ల‌కిందులు చేసేది ఆరోగ్యం.. హ‌ఠాత్తుగా ఆనారోగ్య స‌మ‌స్య ఏర్ప‌డితే ప్రాణాన్ని రక్షించుకోవాల‌ని హడావుడిగా ఆసుప‌త్రివైపే బ‌య‌లుదేరుతున్నారు.. ఈ మ‌హాన‌గ‌రంలాంటి హైద‌రాబాద్‌లో ఎక్క‌డ, ఏ వైపు చూసినా ప్ర‌యివేట్ ఆసుప‌త్రులే కనిపిస్తున్నాయి.. ప్రాణం మీద ఆశ‌తో ప్ర‌యివేట్ ఆసుప‌త్రిలో చేరి ఆస్తులన్ని అమ్ముకుంటున్నారు..

హైద‌రాబాద్ న‌గ‌రంలోప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయ‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ తెలంగాణ వైద్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీని స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ప్ర‌శ్నించ‌గా హైద‌రాబాద్ డిఎంహెచ్ఓ అందుకు సంబంధించిన స‌మాచారం ఇచ్చారు.

ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన ఉచిత వైద్యం అందిస్తామ‌నే ఆలోచ‌న మాత్రం ప్ర‌భుత్వాల్లో లేదు. ఎందుకంటే హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి గ‌ల్లీకి ఒక ప్ర‌యివేట్ ఆసుప‌త్రి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఒక హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకున్న ప్ర‌యివేట్ కార్పోరేట్ ఆసుప‌త్రులు 330 ఉన్నాయ‌ని హైద‌రాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్‌కు స‌మాచారం పంపార‌ని సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.

కొన్ని జిల్లాల‌లోని డిఎంహెచ్ఓలు పంపిన సమాచారం..

వ‌రంగ‌ల్

వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుప‌త్రులు – 105,
అందులో శ‌స్త్ర చికిత్స‌లు అనుమ‌తి ఉన్న అసుప‌త్రులు – 65

మ‌హాబూబ్‌న‌గ‌ర్

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుప‌త్రులు – 190
అందులో శ‌స్త్ర చికిత్స‌లు అనుమ‌తి ఉన్న ఆసుప‌త్రులు – 46

పెద్ద‌పల్లి

పెద్ద‌ప‌ల్లిలో ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ఆసుపత్రులు – 115
శ‌స్త్ర చికిత్సలు అనుమ‌తి ఉన్న ఆసుప‌త్రులు – 36

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం

ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ఆసుపత్రులు – 153

జ‌గిత్యాల‌

జ‌గిత్యాల‌లో ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ఆసుప‌త్రులు – 240

సిద్దిపేట

సిద్దిపేట జిల్లాలో ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుప‌త్రులు – 137
శస్త్ర చికిత్స‌లు అనుమ‌తి ఉన్న ఆసుపత్రులు – 70

సూర్యాపేట

సూర్యాపేట జిల్లాలో ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుపత్రులు – 61

వికారాబాద్

వికారాబాద్ జిల్లాలో ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుపత్రులు – 79
శ‌స్త్ర చికిత్స‌లు అనుమ‌తి ఉన్న ఆసుపత్రులు – 39

ఖ‌మ్మం

ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుప‌త్రులు – 243
శస్త్ర చికిత్స‌లు చేసే ఆసుప‌త్రులు – 85

జోగులాంబ గ‌ద్వాల

జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుపత్రులు – 41
శ‌స్త్ర చికిత్స‌లు చేసే ఆసుప‌త్రులు – 26

ఆసిఫాబాద్

ఆసిఫాబాద్ జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుపత్రులు – 50

భూపాల‌పల్లి

భూపాల‌పల్లి జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్ర‌యివేట్ ఆసుప‌త్రులు – 32