Saturday, December 21, 2024
HomeUncategorizedఒక రాష్ట్రంలో 48 న‌దులు ప్ర‌వ‌హిస్తాయి

ఒక రాష్ట్రంలో 48 న‌దులు ప్ర‌వ‌హిస్తాయి

Date:

మ‌న దేశంలో 400కు పైగా చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం గంగా, సింధు, గోదావరి, నర్మదా, బ్రహ్మపుత్ర, కృష్ణా, యమునా, తపతి వంటి నదులతో సహా 8 ప్రధాన నదులలో కనిపిస్తాయి. ఈ నదులన్నీ వ్యవసాయానికి అనుకూలమైన సారవంతమైన ఒండ్రుమట్టికి ఉత్తమ వనరు. నదులు నీటిని అందించడమే కాకుండా గృహ, పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను తమ వెంట తీసుకెళ్తాయి. అయితే దేశంలో అత్యధికంగా నదులు ప్రవహించే రాష్ట్రం ఏంటో తెలుసా. దీనికి ఇప్పుడు సమాదానం తెలుసుకుందాం.

ఈ రాష్ట్రంలో 48కి పైగా నదులు ప్రవహిస్తాయి. వాటిలో ఎక్కువ భాగం గంగానదిలో కలుస్తాయి. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియదు. భారతీయ నదులను మనం కేవలం నీటి వనరులుగా చూడలేం. వాటిని ప్రాణదాత దేవుళ్ళుగా భావిస్తాము. ఇక ప్రతి నదికి పుష్కరాలు ఉంటాయి.. ఆ సమయంలో వాటిని ప్రత్యేకంగా పూజిస్తాము. ఇక ఎక్కువ నదులు ప్రవహించే రాష్ట్రం పేరు మీకు తెలుసా.. ఈ ప్రశ్నకి సమాదానం తెలియకపోతే.. మీకు మరో చిన్న క్లూ ఇస్తున్నాం. ఆ రాష్ట్రం జనాభా పరంగానే దేశంలోనే అతి పెద్దది.

48 నదులు ప్రవహిస్తున్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఇందులో ప్రధానంగా గంగా, యమునా, చంబల్, ఘఘ్రా మరియు బెత్వా నదులు ఉన్నాయి. ఇవి ప్రజల జీవనోపాధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ రోజు మనం ఉత్తర ప్రదేశ్ గుండా ప్రవహించే నదుల పేర్లను తెలుసుకుందా. వీటిలో చాలా నదులు ఇతర నదులతో కలుస్తాయి. ఉదాహరణకు, యమునా మరియు సరస్వతి అలహాబాద్ లోని గంగా నదిలో కలుస్తాయి. అయితే సరస్వతీ నది పేరు ఈ జాబితాలో చేర్చబడలేదు, ఎందుకంటే ఇది ఇప్పుడు, ఎక్కడా కనిపించదు.

ఉత్తర ప్రదేశ్‌లో బనారస్‌లో ప్రవహిస్తున్న అస్సీ నది, నేపాల్ నుంచి వచ్చే బాబాయ్ నది, బకులాహి నది, బనాస్ నది, బెలన్, బెసు, బెట్వా, భైంసాహి, భైంసాయ్, చంబల్, చోటి సరయూ, దేవ్హా, ధాసన్, జౌన్ పూర్‌లో ప్రవహిస్తున్న గంగి, గంగ, గోమతి, ఘఘ్రా, హిండన్, జామ్నీ, కాళీ , కహర్, కర్మనాసా, కథనా, కెన్.. ఉత్తరాఖండ్‌లోని కోక్రీ నది. కుక్రైల్ నదులు చేర్చబడ్డాయి. వీటితో పాటు మాగై నది, మేఘాయ్, పిరై, రామ్గంగ, రిహండ్, రోహ్ని, సాయి నది, సరయాన్, ససుర్ ఖాదేరి, సెంగార్, శారదా, సింధ్, సోన్ రివర్, సోట్, సుహేలీ, తామ్సా, ఉల్ నది, వరుణ, వాకల్, పశ్చిమ రాప్తి మరియు యమునా నది. యూపీలో ప్రవహించే మొత్తం 48 నదులు ఇవే.