Saturday, December 21, 2024
HomeUncategorizedఈ పోలీస్‌ను చూస్తే ప‌నిలోనే ఆనందం

ఈ పోలీస్‌ను చూస్తే ప‌నిలోనే ఆనందం

Date:

గంటల కొద్ది రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చూడాలంటే ఎంతో కష్టమనే చెప్పొచ్చు. కానీ, ఓ ట్రాఫిక్‌ పోలీసు మాత్రం ఎలాంటి నీరసం, విసుగు లేకుండా తన విధులను ఎంతో ఆస్వాదిస్తున్నాడు. రోడ్డుపై డ్యాన్స్‌ చేస్తూ వచ్చి పోయే వాహనాల రద్దీని క్లియర్‌ చేస్తున్నాడు. అతడు తన పనిని ఆస్వాదిస్తున్న తీరు చూపరులను ఎంతో ఆకర్షించింది. దీనిపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. ”ఫలానా పని బోరింగ్‌ అంటూ ఏమీ ఉండదు. ఏ పనిలోనైనా ఆనందం వెతుక్కోవచ్చని నిరూపించాడు ఈ పోలీసు” అని అభినందించారు. మహీంద్రా పోస్టు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ”ఇలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా జీవించగలరు”.. ”ఇలాంటి ట్రాఫిక్‌ పోలీసు మా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది”.. ”డ్యాన్స్‌ సూపర్‌ భయ్యా”.. ”ప్రతి మండే మీరు పంచుకునే మోటివేషన్‌ వీడియో మాలో ఎంతో స్ఫూర్తి కలిగిస్తోంది. థాంక్యూ సర్‌” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.